Header Banner

పొలికల్ రీఎంట్రీపై మెగాస్టార్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్! ఆయనను హర్ట్ చేసింది వాళ్లేనా!

  Wed Feb 12, 2025 09:30        Entertainment

బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బ్రహ్మా ఆనందం. ఇందులో బ్రహ్మానందం తాతగా, రాజా గౌతమ్ ఆయన మనవడిగా నటించారు. తాజాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో నిర్వహించగా, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తన జీవితంలో వచ్చిన మార్పులను వివరించారు. 

 

ఇది కూడా చదవండి: ఇలాంటి నీచమైన పనులు వైసీపీకి తప్ప మరెవరికి చేతకాదు! ఊరినే తాకట్టుపెట్టిన వైకాపా నేత.. వెలుగులోకి మరిన్ని నిజాలు! 

 

"ఇక నేను ఎప్పటికీ రాజకీయాల జోలికి వెళ్లను. నా ఆశలు, ఆశయాలు నెరవేర్చడానికి, ప్రజాసేవ చేయడానికి పవన్ కల్యాణ్ ఉన్నాడు... ఇక నేను పూర్తిగా సినిమా రంగానికే అంకింత అవుతాను. ఇటీవల నేను పలువురు పెద్ద రాజకీయ నాయకులను కలుస్తుండడంతో చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాంటిదేమీ లేదు... రాజకీయంగా నేను ఎలాంటి ముందడుగు వేయడంలేదు. చిత్ర పరిశ్రమలోనే ఉంటాను. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత నేను ఎంతో ఒత్తిడి అనుభవించాను. నన్ను మాటలు అన్నవాడ్ని, ఏమీ అనని వాడ్ని కూడా తిట్టాల్సి వచ్చేది. ఏం తిట్టాలో కూర్చుని మరీ రాసుకోవాల్సి వచ్చేది. నేను గంభీరంగా మారిపోవడం చూసి ఓ రోజు సురేఖ అడగనే అడిగింది... ఏంటండీ మీరు అసలు నవ్వడమే మానేశారు అంది. నాకే అనిపించింది... నాలోని హాస్య గ్రంథులు దొబ్బేశాయా అనుకున్నాను. కానీ రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చాక నాలోని వినోదం మళ్లీ వచ్చింది" అని చిరంజీవి వివరించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైఎస్సార్ జిల్లాలో భూకబ్జాల కలకలం.. వైకాపా నేతలపై కేసులు నమోదు! కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణ!

 

ట్రాన్స్ జెండర్ ని ప్రేమించాడు.. తండ్రి సమాధి వద్దే.. చివరికి అతనికి జరిగింది ఇదే!

 

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం! ఆ తీర్మానాన్ని రద్దు చేస్తూ..

 

జగన్‌ను కుంగదీసే ఎదురు దెబ్బ.. మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్‌బై! శివరాత్రి నాటికి కీలక నిర్ణయం!

 

వందేభారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం! పూర్తి వివరాలు ఇవే!

 

చంద్రబాబు భారీ శుభవార్త.. కీలక ప్రకటనఈ నెల 12 వ తేదీ వరకూ! వెంటనే అప్లై చేసుకోండి! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Entertainment #Politics #Chiranjeevi #MegaStar